Logo
Date of Publish : 30 December 2020, 1:30 am
Editor : Sake Naresh

మీ కుక్కకి ఓ రోజు ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆసక్తికరమైన ఉత్తర్వులను జారీ చేసింది. పెంచుకునే కుక్కలు, పందులకు లైసెన్స్ ఉండాలంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలను జారీ చేసింది.

లైసెన్స్ లేని కుక్కలు, పందులను అధికారులు పట్టుకుంటే... వాటికి సంబంధించిన యజమానికి రూ. 500 ఫైన్ విధించనున్నారు. ఇలా, రోజుకు రూ. 250 చొప్పున పెనాల్టీ వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

కుక్కలు, పందులకు లైసెన్స్ ముగిసిపోతే... తిరిగి 10 రోజుల్లోగా లైసెన్స్ ను  పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.

యజమానులకు లైసెన్స్ అందించే సమయంలో వాటి హెల్త్ సర్టిఫికెట్లు కూడా అందించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ ను అందించాలని ఆదేశించింది. ఈ జంతువులకు టోకెన్లను జారీ చేయాలని తెలిపింది. ఈ టోకెన్లు వాటి మెడ చుట్టూ నిరంతరం వేలాడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies