Logo
Date of Publish : 16 July 2021, 1:01 pm
Editor : Sake Naresh

పోస్టులు పెంచి APPSC  గ్రూప్-1,2 లకు నోటిఫికేషన్ 

అమరావతి, (ADITYA9NEWS): ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టుల పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు తెలిపారు. మొత్తం వివిధ కేటగిరిలలో 1,180 ఖాళీలను గుర్తించామన్నారు. వీటిలో గ్రూప్‌ -1, గ్రూప్‌ -2 సహా పలు విభాగాల పోస్టులు ఉన్నాయని చెప్పారు. పోస్టులు పెంచి వచ్చే నెల గ్రూప్‌, పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. గ్రూప్‌-1 మినహా ఏ నోటిఫికేషన్‌కూ ప్రిలిమ్స్‌ ఉండదని ఆయన తెలిపారు. ఇక నుంచి వచ్చే ప్రతీ నోటిఫికేషన్ లోనూ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక నుంచి 3,4 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని సలాంబాబు వెల్లడించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies