Logo
Date of Publish : 15 April 2024, 7:46 am
Editor : Sake Naresh

బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బాజీబాబా

బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బాజీబాబా

 

_18న నామినేషన్

జై తెలంగాణ న్యూస్ ఖమ్మం ఏప్రిల్ 14:

బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బాజీ బాబా ఈ నెల 18న బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పార్లమెంట్ బరిలో నిలుస్తు న్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ఓ ప్రకటన వెల్లడించిన ఆయన.. జిల్లాలో ముస్లింలకు జరిగిన అన్యాయంపై గళం విప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ముస్లింల బలాన్ని, ఐక్యతను చాటేందుకు, కుట్రదారులను తరిమికొట్టేందుకు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటిదాకా. ఆయా పార్టీల నాయకులంతా ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని, అందుకే తమ ఓట్లు తామే వేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. నామినేషన్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై తనను ఆశీర్వదించాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies