Logo
Date of Publish : 26 April 2024, 5:54 pm
Editor : Sake Naresh

రెండో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన ముల్కల్ల రాజేంద్రప్రసాద్

రెండో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన ముల్కల్ల రాజేంద్రప్రసాద్

జై తెలంగాణ న్యూస్, మంచిర్యాల జిల్లా బ్యూరో:-

జరగనున్న పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా మందమర్రి పట్టణానికి చెందిన ముల్కల్ల రాజేంద్రప్రసాద్ శుక్రవారం రెండో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ముందుగా మండలంలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేముల వీరేందర్, కళ్యాణపు చిట్టిబాబు, చల్లూరి శ్రీహరి, సాతారపు నారాయణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies