Logo
Date of Publish : 29 April 2024, 4:47 pm
Editor : Sake Naresh

ఖమ్మం డిఆర్డీఏ కూరగాయల మార్కెట్ లో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం

ఖమ్మం డిఆర్డీఏ కూరగాయల మార్కెట్ లో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం

- మీ బిడ్డను ఆశీర్వదించండి

- పార్టీలకతీతంగా పని చేశా

- గిట్టుబాటు ధర కోసం పార్లమెంట్ లో కొట్లాడా...

- నాపై బయటి వ్యక్తిని పోటీకి పెట్టారు

జై తెలంగాణ న్యూస్ ( ప్రత్యేక ప్రతినిధి - పాషా )

నేను ఖమ్మం జిల్లా రైతు బిడ్డను... మీ వాడిని... ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ...ఇక్కడే రూ లకు రోజు కూలీగా పని చేసినోడిని... మీలో ఒకడిగా ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ అండగా ఉంటున్న తనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం డిఆర్ డీఏ వద్ద ఉన్న కూరగాయల సముదాయాన్ని సోమవారం ఉదయం సందర్శించి, కూరగాయల రైతులను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీలకతీతంగా పనులు చేసిన తనను దీవించాలన్నారు.ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండి, ఏ కష్టమొచ్చినా ఆదుకునే తనను ఈ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించి, పార్లమెంట్ కు పంపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. తన మీద బయటి నుంచి తీసుకువచ్చి పోటీకి పెట్టారని, తాను మీ వాడినని, జిల్లా బిడ్డనని పేర్కొన్నారు. రెండు సార్లు పార్లమెంట్ కు పంపితే పార్లమెంట్ సాక్షిగా జిల్లా గొంతుకనై కేంద్రంతో కోట్లాడి, నిధులు తెచ్చి ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. మళ్లీ ఆశీర్వదించి, పార్లమెంట్ కు పంపాలని కోరారు. రైతు బిడ్డను కనుకనే కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చినప్పుడు పార్లమెంట్ సాక్షిగా అడ్డుకున్నానని చెప్పారు. వాటిని వెనక్కి తీసుకునేంత వరకు కేంద్రంతో కొట్లాడానని తెలిపారు. రైతుకు కనీస గిట్టుబాటు మద్దతు ధర కోసం పార్లమెంట్ ను స్తంభింపజేసినట్లు తెలిపారు.క్షేత్ర స్థాయిలో గడప గడపకు వెళ్లి తలుపు తట్టి, కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టి, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, తోట రామారావు, మోరంపూడి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies