Logo
Date of Publish : 18 July 2024, 12:13 am
Editor : Sake Naresh

ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి _ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్

ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి

_ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్

ఖమ్మం, ( జై తెలంగాణ న్యూస్ ) 18 జూలై

కోతలు, కొరతలు, ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల రుణమాఫీ చేయాలని సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నాడు రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మాస్ లైన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుటుంబాన్ని నిర్ణయించడానికి రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటామన్న ప్రభుత్వ ప్రకటనతో అనేకమంది రైతులు భయాందోళనలకు గురవుతున్నారని గడిచిన తొమ్మిది సంవత్సరాలగా రేషన్ కార్డులు ఇవ్వలేదని , రేషన్ కార్డులో పేర్లు తొలగించడం గాని చేర్చడం కానీ అవకాశం లేదని దీని కారణంగా దశాబ్దం కితమే వేరైనా కుటుంబాలు సైతం రేషన్ కార్డులో ఒకే కుటుంబం ఉంటే ప్రమాదం ఉంది కనుక దాని పరిగణలోకి తీసుకుంటే చాలామంది రైతులు రుణమాఫీ అమలు కాదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రేషన్ కార్డులు నిబంధన తొలగించి క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆయన కోరారు .అదేవిధంగా ల్యాండ్ ఎలిజిబిలిటీ కార్డుల ద్వారా అనేక వేలమంది సన్న చిన్న కారు రైతులు రుణాలు పొందారుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి రుణమాఫీ జరిగే అవకాశం లేదని తక్షణమే ల్యాండ్ ఎలీజీబిలిటీ కార్డు ద్వారా రుణాలు పొందిన రైతులందరికీ కూడా రుణమాఫీని అమరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు .ఒక ఎకరం భూమి ఉన్న రైతులను కలిపి జేఎల్సి అనే గ్రూపులు ఏర్పర్సి దానిద్వారా రైతులకు రుణాలు ఇచ్చారని అటువంటి రైతులకు రుణమాఫీలు ప్రభుత్వ ఏం చేయదలుచుకుందని ఆయన ప్రశ్నించారు. సుమారు 16 లక్షల మంది తెలంగాణలో కౌలు రైతులు ఉన్నారని వీరికి ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించే ప్రయత్నం చేయటం లేదని దానివల్ల నిజంగా వ్యవసాయం చేస్తున్న కౌలు రైతుల కు అటు గిట్టుబాటు ధర రాక ఇటు రైతు భరోసా అందగా రుణాలు మాఫీ కాక మరింతగా అన్యాయానికి గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కౌలు రైతును గుర్తించి వారికి పంట రుణాలు పెట్టుబడి సాయం రుణమాఫీ అందజేయాలని అన్నారు. ఆయన కోరారు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం తదితర సమస్యలను పై ప్రభుత్వం సన్నీరుగా ఉందని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు నీరు అందిస్తున్న ప్రభుత్వం ఇల్లందు ప్రాంతాన్ని మినహాయించడం సరికాదని. ఇల్లందు ప్రాంతాన్ని కూడా సీతారామ ప్రాజెక్టులు తీసుకొచ్చి సాగునీరు తాగునీరు అందించే చర్యలు తీసుకోవాలని వారు కోరారు .వ్యవసాయ కార్మికులకు నెలకొక్క వెయ్యి రూపాయలు చక్ర సంవత్సరానికి 12000 ఇస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించారు కానీ ప్రకటించిందని రెక్కల తప్ప ఆస్తులు లేని వ్యవసాయ కార్మికుల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణానికి డబ్బులు పెన్షన్లు పోడు భూములకు పట్టాలు తదితర సమస్యలపై ఈనెల 22న తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తున్నట్లు 29న జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనకి నిర్వహించాలని ఆగస్టు 21న చలో హైదరాబాద్ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు

ఈ ప్రెస్ మీట్ లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే రంగయ్య చిన్న చంద్రన్న గుమ్మడి నరసయ్య వి ప్రభాకర్ గోకినపల్లి వెంకటేశ్వర్లు ముద్ద బిక్షం ఎం కృష్ణ రామకృష్ణ గుర్ర ఆచ్చయ్య ఆవుల వెంకటేశ్వర్లు జి రామయ్య సివైపుల్లయ్య అవుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies