Logo
Date of Publish : 12 October 2025, 9:12 pm
Editor : Sake Naresh

గల్ఫ్ జనసేన పార్టీ కువైట్ మద్దతుదారులకు చిరు సన్మానం

సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గల్ఫ్ జనసేన పార్టీ కువైట్ కార్యవర్గానికి వెన్నుదండుగా ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణం సాగిస్తూ, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, ఎటువంటి ఆర్థిక సహాయం అవసరమైనా ముందుండే చీర్ల మల్లికార్జునని మరియు చల్లా మల్లికార్జున రెడ్డిని గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్  కంచన శ్రీకాంత్  ఆధ్వర్యంలో, కార్యవర్గ సభ్యుల సమక్షంలో సన్మానించడం జరిగింది.

అలాగే, కువైట్‌లో సేవకు మారుపేరుగా నిలిచిన జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పటిష్టంగా ముందుకు సాగుతూ, మరెంతో మంది జనసేన మద్దతుదారులను కలుపుకుంటూ, “గల్ఫ్ దేశాల్లో మేము జనసైనికులం ఉన్నాము” అనే భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నామని కంచన శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ జనసేన పార్టీ కువైట్ కో-కన్వీనర్లు దండు చంద్రశేఖర్, షేక్ అలీ షేక్, జిగిలి ఓబులేసు, కోలా మురళి, యూత్ నాయకులు అల్లం ప్రేమ్ రాయల్, కొమ్మినేని బాలాజీ, మొగిలుశెట్టి మనోహర్, రెడ్డిచర్ల ఆంజనేయులు, పసుపులేటి రాజేష్, అప్పిన చిరంజీవి, బాషా తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies