Logo
Date of Publish : 29 June 2020, 2:30 am
Editor : Sake Naresh

ఉద‌యం 7 నుండి రాత్రి 7 వ‌ర‌కే

 ఏపీలోకి వాహనాల అనుమతి  : ఎస్పీ రంగనాధ్

నల్లగొండ జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్ వెళ్లాలనే ప్రయాణికులు  ఇకపై ఉదయం
7.00 గంటల నుండి సాయంత్రం 7.00 వరకు మాత్రమే సరిహద్దు వద్ద వాహనాల
అనుమతించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నల్లగొండ నుండి
ఏ.పి.లోకి వెళ్లే అన్ని వాహనాలను సాయంత్రం 7.00 తర్వాత ఆంధ్రా
సరిహద్దులలో నిలిపివేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ నుండి వచ్చిన
స‌మాచారంతో  ఈనిర్ణ‌యం తీసుకున్న‌ట్టు రంగ‌నాథ్ స్ప‌ష్టం చేశారు.

 రాత్రి. 7.00 గంటల తర్వాత ఆంధ్రా సరిహద్దులకు వెళ్లి ప్రయాణికులు
ఇబ్బందులు పడవద్దని ఆయన సూచించారు. ఇక ఇదే సమయంలో నల్లగొండ జిల్లా మీదుగా మాచర్లకు వెళ్లే మార్గంలో ఉన్న నాగార్జున సాగర్ - మాచర్ల రోడ్డును
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రోడ్డుగా గుర్తించనందున ఆ మార్గంలో
ఎలాంటి ప్రజా రవాణా, వాహనాలను ఏ.పి. పోలీసులు అనుమతించడం లేదని ఈ
విషయాన్ని ప్రయాణికులు గమనించుకోవాలని సూచించారు.

*పాస్ ఉంటేనే అనుమతి*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సరుకు రవాణా, అత్యవసర
సేవల వాహనాలు మినహా మిగిలిన అన్ని ప్రైవేట్ వాహనాలలో ప్రయాణించే వారికి
విధిగా పాస్ ఉండాలని, పాస్ లేకుండా ప్రయాణాన్ని వారు అనుమతించడం లేదని
అందువల్ల ప్రయాణికులు ఆంధ్రాకు వెళ్లే సమయంలో విధిగా పాసులు సంబంధిత
అధికారుల నుండి తీసుకుని ప్రయాణం చేయాలని జిల్లా ఎస్పీ రంగనాధ్
సూచించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies