Logo
Date of Publish : 16 July 2020, 2:49 am
Editor : Sake Naresh

సెల్ సిగ్నల్ తీసిన ప్రాణం

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు తన ఫోన్‌లో సిగ్నల్ సరిగా రావడంలేదని మరో ఊరికి వెళ్లాడు. సిగ్నల్ వచ్చే ప్రాంతంలో ఓ చింతచెట్టు కింద నిల్చుని ఫోన్ చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం రావడం ప్రారంభమయ్యింది. అంతలోనే పెద్ద శబ్ధంతో పిడుగు పడింది. దీంతో ఆ యువకుడు చెట్టుకిందనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన ఈసం కృష్ణ(22) స్మార్ట్ ఫోన్ వాడుతున్నాడు. అయితే తన మొబైల్‌లో త్రీజీ సిగ్నల్ సరిగా రావడం లేదు. దీంతో పక్కనే ఉన్న గొరకలమడుగు గ్రామ సమీపంలోకి చింతచెట్టు కిందకు వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ భారీ వర్షం కురుస్తోంది….

ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడడంతో కృష్ణ అక్కడికక్కడే మరణించాడు. వాస్తవానికి శంభునిగూడెం గ్రామంలో త్రీజీ సిగ్నల్ సరిగా రాదు. దీంతో ఆ గ్రామానికి చెందిన వారంతా గొరకలమడుగు గ్రామానికి వెళుతుంటారు. కొందరు యువకులు సాయంత్రం సమయంలో చాటింగ్ కోసం ఎక్కువగా ఆ చెట్టు కిందకే వెళుతుంటారు. కృష్ణ సైతం సిగ్నల్స్ కోసం పిడుగుపాటుకు గురై మరణించడం స్థానికంగా విషాదాన్ని నింపింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies