Logo
Date of Publish : 07 August 2020, 8:06 am
Editor : Sake Naresh

మిగిలిన వారికి ఒట్టి చేతులేనా..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కరోనా కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

చేనేత కుటుంబాలకు రూ.24 వేలు ఇస్తామని చెప్పి కేవలం 80 వేల కుటుంబాలకే ఇస్తే మిగిలిన లక్షల కార్మికుల పరిస్థితి ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు మూడు నెలల కాలానికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలన్నారు.

నూలుపై సబ్సిడీ, పావలా వడ్డీ, త్రిఫ్ట్‌ ఫండ్‌ బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలన్నారు. నేతన్నల దగ్గరున్న సరకును కొనుగోలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం ప‌థ‌కాలు ప్ర‌చారంలో త‌ప్ప అమ‌లులో అన్ని విఫ‌ల‌మ‌వుతున్నాయ‌న్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies