Logo
Date of Publish : 03 September 2020, 2:41 am
Editor : Sake Naresh

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

కోస్తాంధ్ర,  తమిళనాడు మధ్య బంగాళాఖాతం లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.ఇది సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. జార్ఖండ్‌ పరిసరాల్లో మరో ఆవర్తనం ఉంది.వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

5, 6 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.బుధవారం విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మార్టూరులో 80, పమిడి, గార్లదిన్నెల్లో 70, రావినూతల, అయ్యవారిపాలెంలలో 60, కొరిసపాడు 58, బొబ్బిలి 55, విశాఖపట్నంలో 51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies