Logo
Date of Publish : 17 September 2020, 1:50 pm
Editor : Sake Naresh

చిక్కుల్లో స్టైలిష్ స్టార్ అర్జున్..

అల్లు అర్జున్‌పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సమాచార హక్కు సాధనా స్రవంతి ప్రతినిధులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై సమాచార హక్కు సాధనా స్రవంతి ప్రతినిధులు అదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్, పుష్ప చిత్ర యూనిట్ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి కుంటాల జలపాతాన్ని సందర్శించారని వారు పోలీసులకు తెలిపారు.

ఇటీవల అల్లు అర్జున్ అదిలాబాద్ జిల్లాకు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుంటాల జలపాత సందర్శనను ప్రభుత్వం నిలిపేసినా.. అల్లు అర్జున్, పుష్ప టీమ్ సభ్యులు అక్కడకు వెళ్లారని, అనుమతులు లేకుండా తిప్పేశ్వర్‌లో షూటింగ్ చేశారని సమాచార హక్కు సాధనా స్రవంతి ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies