Logo
Date of Publish : 20 December 2020, 1:36 pm
Editor : Sake Naresh

జ‌న‌వ‌రి 8 వ‌ర‌కూ ప‌లు రైళ్లు ర‌ద్దు..

 

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే విజ‌య‌వాడ డివిజ‌న్ ‌ పరిధిలోని తూర్పుగోదావ‌రి జిల్లా లోని రాజమహేంద్రవరం యార్డు రీమోడలింగ్‌ పనుల కారణంగా ఈ నెల 25వ తేదీ నుంచి జనవరి 8 వరకు ప్రత్యేక రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

ఈ మార్గంలో 24 రైళ్లను పూర్తిగా, 4 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 8 రైళ్లను దారి మళ్లించి నడిపించనున్నారు.

రద్దయిన వాటిలో కాకినాడ

టౌన్‌-లింగంపల్లి-కాకినాడ టౌన్‌ (నం.02775/02776),

శాలిమార్‌-సికింద్రాబాద్‌-శాలిమార్‌ (నం.02773/02774),

విశాఖపట్నం-విజయవాడ-విశాఖపట్నం (నం.02717/02718),

విశాఖపట్నం-కడప-విశాఖపట్నం (నం.07488/07478),

కాకినాడపోర్టు-ముంబయి ఎల్‌టీటీ-కాకినాడపోర్టు (నం.07221/07222)తో పాటు మరికొన్ని రైళ్లు ఉన్నాయి.

 

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies