*ఏసు ప్ర‌భువు*ను జ్ఞాప‌కం చేసుకునే స‌మ‌యం : ఏపీ గ‌వ‌ర్న‌ర్

అమ‌రావ‌తి(ADITYA9NEWS): ప్ర‌జ‌లంద‌రూ ఏసు ప్రభువును జ్ఞాప‌కం చేసుకునే స‌మ‌యమ‌ని ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకించి క్రైస్తవ సోదరులకు గ‌వ‌ర్న‌ర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

“క్రిస్మస్ అంటే యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయం. విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ,సహనం, కరుణ పూర్వక అనుబంధాలను మేలుకొలుపుతూ యేసు బోధలను ఆదరించే సందర్భం ఇది. ధర్మం, విశ్వాసపూరితమైన గమనానికి యేసుక్రీస్తు జీవనం మనందరికీ ప్రేరణనిస్తుందని గ‌వ‌ర్న‌ర్ అన్నారు.

క్రైస్తవ సోదరులతో కలిసి ప్రపంచంలో శాంతి, సామరస్యం కోసం ప్రార్థిస్తున్నాను. కరోనా ముప్పు ఇప్పటికీ పొంచి ఉంది. సాంఘిక దూరాన్ని పాటించటం, ముఖ ముసుగును ధరించటం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి అన్ని జాగ్రత్తలు తీసుకుని తమ నివాసాలలో సురక్షితంగా ఉంటూ పండుగను జరుపుకోవాలని గ‌వ‌ర్న‌ర్ సూచించారు. అంద‌రికీ హ్యాపీ, మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు” అని శుభాకాంక్ష‌లు తెలుపుతూ రాజ్ భవన్ నుండి ప్రకటనను విడుద‌ల చేశారు.

Loading

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Facebook

టాప్ న్యూస్